
మేషం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాలు గజకేసరి యోగం, అధియోగాలతో పటిష్ఠమైనందువల్ల ఎటు వంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు పడ తాయి. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. తప్పకుండా లక్ష్మీ కటా క్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల గజకేసరి యోగం, అధియోగం యోగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా అంచనాలను మించి విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కర్కాటకం: సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడికి గజకేసరి యోగం, అధియోగం కలగడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, అంచనాలను మించి లాభి స్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. సంతాన యోగం కలగడానికి అవకాశముంది. తుల: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో ఈ గజకేసరి, అధి ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆస్తి లాభానికి, భూ లాభానికి అవకాశం ఉంది. కొత్వరలో సొంత ఇంటి కల నెర వేరుతుంది. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో