
చాక్లెట్ తీపి వెనుక అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కొవ్వు పదార్థాలు దాగి ఉంటాయని వైద్యులు తరచూ హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఫ్రూట్ చాక్లెట్లు (పాప్స్) అందించే దిశగా ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. ఆ విశేషాలే ఇవి... పిల్లలు, యువతలో చాక్లెట్లపై అధిక మక్కువ పెరగడాన్ని శాస్త్రవేత్తలు ‘చాకోహాలిజం’ అంటున్నారు. ఇది తీపి తినాలనే కోరిక మాత్రమే కాదు; అధిక చక్కెర వినియోగం, పేగుల ఆరోగ్యం, జీవక్రియలపై ప్రభావం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అలవాటు. ఈ సమస్యకు ఆరోగ్యకరమైన పరిష్కారం చూపుతున్నారు ఒక సైంటిస్ట్. ఆయన కని పెట్టిన ‘ఫ్రూట్ పాప్స్’ పూర్తిగా తాజా పండ్లతో తయారైన సహజ తీపి స్నాక్. ఈ ఫ్రూట్ పాప్స్ను ఫుడ్ సైంటిస్ట్ డా. చెన్నకేశవరెడ్డి, ఎస్వీయూ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సుచరిత గైడెన్స్లో అభివృద్ధి చేశారు. చాక్లెట్ రుచిని కోరుకునేవారికి పండ్లలోని పోషకాలను అందించాలనే ఉద్దేశంతో దీనిని అభివృద్ధి చేశారు. ఈ ఉత్పత్తిలో శుద్ధి చేసిన చక్కెర, కృత్రిమ రంగులు, కృత్రిమ ఫ్లేవర్లు లేదా రసాయన ప్రిజర్వేటివ్లకు చోటు లేదు. పండ్లలో సహజంగా ఉండే తీపినే ఉపయోగిం చడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పండ్లనే చాక్లెట్లా... పిల్లల్లో చాక్లెట్లు, క్యాండీలు, అధిక చక్కెర కలిగిన స్నాక్స్ వినియోగం పెరుగుతుండటంతో ఊబకాయం, దంత సమస్యలు, జీవనశైలి సంబంధిత అనారోగ్యాలపై ఆందోళన వ్యక్తమవు తోంది. అలాంటి పరిస్థితుల్లో సహజ పండ్ల ఆధారిత ప్రత్యామ్నాయాల అభివృద్ధి అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పిల్లలు ఇష్టపడే రుచి, ఆకర్షణీ యమైన రూపంతో పాటు పోషక విలువలు కూడా అందేలా అనేక పరీక్షల తర్వాత ఈ ‘ఫ్రూట్ పాప్స్’ తయారు చేశాం. అయితే వాస్తవానికి ఇది చాక్లెట్ కాదు. చాక్లెట్లో పండ్ల రుచి కలపడం కాదు. పండ్లనే చాక్లెట్లా కనిపించేట్టు, తినడానికి సులభమైన