
డ్రగ్స్‌కు వ్యతిరేక పోరాటంలో భాగంగా కేరళలోని కన్నూరుకు చెందిన ఓ యువకుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సివిల్ ఇంజినీర్‌గా చేస్తున్న సనిత్ కేరళ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు వన్ వీల్‌తో సైకిల్ యాత్ర చేస్తున్నాడు. గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్ యాత్ర చేశాడు సనిత్. అప్పుడు దాదాపు ఏడు వేల కి.మీ దూరం... 265 రోజులపాటు ఒంటి చక్రంతోనే ప్రయాణించాడు. ఇప్పుడు కేరళ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సాహసయాత్రకు సిద్ధమయ్యాడు. ‘‘నా ప్రయాణం ప్రపంచ రికార్డు కోసమే కాదు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేలా వారిలో సానుకూల దృక్పథం పెంచాలనేదే నా ధ్యేయం’’ అని సనిత్ తెలిపాడు. ఈ వార్త చదివారా: సీఎం విజయ్ రోజుకు 20 గంటలు పనిచేస్తారు: ఆధవ్ అర్జున