© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Train accident at Eluru chebrolu: ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సదరు వ్యక్తులు.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు పట్టాలపై ఛిద్రమయి పడిపోయి ఉన్నాయి. స్థానికంగా ఉన్న రైల్వే సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం మృతుల వివరాలపై విచారణ చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో.. ఒక మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు లభ్యమైంది. మరో మృతదేహం వద్ద ఆర్టీసీ పార్కింగ్ పాస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Read more:తెల్లవారుజామున ఘోర సంఘటన.. అన్నదమ్ముళ్లను బలిగొన్న ఆర్టీసీ బస్సు వీటి ఆధారంగా మృతుల వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. అసలు..ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..?.. లేక ఆత్మహత్యకు సంబంధించినదా..?.. ఎవరైన వీరిని హత్య చేసి పట్టాలపై పడేశారా..?..వంటి అన్ని కోణాల్లో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్
యాప్ డౌన్లోడ్ చేసుకోండి.