
కర్నాటకలోని బెళగావి సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న చవత్ గల్లీలో రాజారాం అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సోమవారం వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 2.15 గంటలకు కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోని ఫ్రిజ్ ఉన్నట్టుండి భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు జరిగిన వెంటనే ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్నవారికి కోలుకునే సమయం కూడా లేకపోవడంతో శారద (50), ఆమె కుమార్తెలు ప్రియ, గంగలతో పాటు భారతి అనే మహిళ అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి చనిపోయారు. అర్ధరాత్రి ఇరుగుపొరుగున ఉన్న యువకులు ధైర్యం చేసి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీవ్రగాయాలైన రాజారాం, అతని కుమారుడు రోషన్ ను ఎత్తుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.