
బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియాకు ఊహించని, ఘోర పరాభవం ఎదురైంది. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడంతో, ఆసీస్ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ పండితులు జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరాజయాల్లో ఒకటని, ప్రపంచ నంబర్ వన్ జట్టుకు ఇది ఎంతమాత్రం "అంగీకరించలేని" ఫలితమని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.మర్రారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూలి ఆరంభం నుంచే వెనుకబడింది. బంగ్లాదేశ్ 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించి నాలుగో రోజే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యంలో నిలవగా, ఆతిథ్య ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో పడింది.ఈ ఓటమిపై ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, మాజీ బ్యాటర్ మార్క్ వా తీవ్రంగా స్పందించాడు. "ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడలేదు, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ క్రికెట్ చరిత్రలో నేను చూసిన అతిపెద్ద పరాజయాల్లో ఇది ఒకటి కావచ్చు. ఇద్దరు ప్రధాన బౌలర్లు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ చేతిలో పూర్తిస్థాయి బౌలింగ్ లైనప్‌తో ఉన్న ఆస్ట్రేలియా ఓడిపోవడం చాలా పెద్ద విషయం" అని వ్యాఖ్యానించాడు. జట్టు బ్యాటింగ్ వైఫల్యంపై స్పందిస్తూ, రెండో టెస్టుకు ఒకటి, రెండు మార్పులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని, వెదరాల్డ్‌పై తీవ్ర ఒత్తిడి ఉందని అభిప్రాయపడ్డారు.అయితే, మాజీ లెగ్ స్పిన్నర్ కెర్రీ ఓ కీఫ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు