
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ (T Dilip) ప్రశంసలు కురిపించాడు. అతడు ఫీల్డింగ్‌లో చూపించే ఎనర్జీ అద్భుతమని.. ప్రాక్టీస్‌లో చూపించే ఉత్సాహాన్ని మ్యాచ్‌లోనూ ప్రదర్శిస్తాడని పేర్కొన్నాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ఆటగాళ్లపై ఉంటుందని మాజీ ఫీల్డింగ్ కోచ్ తెలిపాడు. ‘‘కోహ్లీ (Virat Kohli) ఫీల్డింగ్‌లో రాజీపడడు. పవర్ ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్లో డైవ్‌లు చేస్తూ బంతిని ఆపే విధానం అద్భుతంగా ఉంటుంది. బంతి తనవైపు రానప్పుడు కూడా అతడి ఫీల్డింగ్ ప్రయత్నాలు ఆగవు. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఈ దశలోనూ చివరి ఓవర్లలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తాడు. అక్కడి నుంచి పరుగెత్తుకొస్తాడు. కోహ్లీతో కలిసి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. అతడిని స్ఫూర్తిగా తీసుకుని తమ సామర్థ్యాలకు మించి రాణించిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అది విరాట్ లెవల్’’ అని దిలీప్ వివరించాడు. ‘‘నా కెరీర్లో అత్యుత్తమ క్షణం గురించి ఆలోచిస్తే 2024 టీ20 ప్రపంచ కప్ గుర్తుకొస్తుంది. కేవలం ఆ ట్రోఫీ మాత్రమే కాదు, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న వాతావరణం. గత నాలుగేళ్లుగా ఆ కుర్రాళ్లు పడ్డ కఠిన శ్రమను నేను గ్రహించగలిగాను. ఆ అనుభూతిని ఎప్పటికీ నా మనసులో భద్రపరుచుకుంటాను’’ అని దిలీప్ తెలిపాడు. నవంబర్ 2021లో భారత జట్టులో చేరిన దిలీప్ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అతను ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నప్పుడు టీమ్ఇండియా రెండు టీ20 ప్రపంచ కప్‌లు (2024, 2026), ఛాంపియన్స్ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్‌లు (2023, 2025) సాధించింది. 2023 వన్డే ప్రపంచ కప్, డబ్ల్యూటీసీలో రన్నరప్‌గా నిలిచింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన