
ఇంటర్నెట్ డెస్క్: కరోనా (COVID-19) పరిశోధనలకు అమెరికా నిధులు (USA Grants) సమకూర్చిందని ఆ దేశ మాజీ అధికారి అంగీకరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వద్ద సలహాదారుగా పని చేసిన డేవిడ్ మోరెన్స్ (David Morens) ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. కొవిడ్ వైరస్‌పై పరిశోధనలకు వెచ్చించిన నిధుల రికార్డులు, ఇతర పత్రాలను అధికారిక సిస్టమ్‌లో కాకుండా.. చట్టాల నుంచి తప్పించుకోవడానికి వ్యక్తిగత ఇ-మెయిల్స్‌లో దాచినట్లు పేర్కొన్నారు. కొవిడ్ పరిశోధన గ్రాంట్లకు సంబంధించి ఏప్రిల్ 2020 నుంచి ఏజెన్సీకి అందిన ప్రజా రికార్డుల అభ్యర్థనలను అడ్డుకున్నట్లు డేవిడ్ మోరెన్స్పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు ఆయనను విచారించగా.. తన తప్పును అంగీకరించారు. మహమ్మారి మొదలైన సమయంలో ఫౌచీ (Anthony Fauci) ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ (NIAID) అధిపతిగా ఉన్నారని.. ఆయనకు తాను సహాయకుడిగా ఉన్నానని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మోరెన్స్ పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్-19 (COVID-19) ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆ సమయంలో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై చేస్తున్న పరిశోధన గ్రాంటును నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఆ గ్రాంటును పునరుద్ధరించడానికి ల్యాబ్ నుంచి కొవిడ్ లీక్ అయిందన్న విషయాన్ని తప్పుడు కథనంగా చూపేలా సాయం చేస్తానని మోరెన్స్ చైనాలోని యాజమాన్యానికి హామీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందులో భాగంగానే కరోనా సహజసిద్ధంగా, జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారన్నారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు వారు ప్రభుత్వ ఇ-మెయిల్ ఖాతాకు బదులుగా మోరెన్స్ వ్యక్తిగత ఖాతాను ఉపయోగించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు గుర్తించామన్నారు. దీంతో ఈ విషయంపై ఆంథోనీ ఫౌచీని కూడా విచారించే అవకాశం ఉంది. కరోనాపై