క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా తరఫున సుదీర్ఘ కాలం పాటు ఆల్ రౌండర్‌గా సేవలందించిన మోసెస్ హెన్రిక్స్ తన కెరీర్లో అత్యంత ఆసక్తికరమైన రెండో అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇన్నాళ్లు ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడిన అతడు.. ఇప్పుడు మరో దేశ జాతీయ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఈ మేరకు పోర్చుగల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హెన్రిక్స్‌ను నియమిస్తూ పోర్చుగల్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అతడి సారథ్యంలోనే పోర్చుగల్ జట్టు 2028 టీ20 వరల్డ్ కప్ యూరప్ సబ్-రీజినల్ క్వాలిఫయర్ 'సి'లో తలపడనుంది. ఫిన్లాండ్ వేదికగా ఆగస్టు 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో జన్మించిన పోర్చుగల్‌లోని 'మదీరా' దీవిలోనే హెన్రిక్స్ జన్మించాడు. చిన్నతనంలో కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు మోసెస్ హెన్రిక్స్. న్యూ సౌత్ వేల్స్, బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్ జట్టుకు వరుసగా 2019-20, 2020-21 సీజన్లలో కెప్టెన్‌గా టైటిళ్లు సాధించి పెట్టాడు. 2021లో బంగ్లాదేశ్‌తో ఆసీస్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ పూర్తి చేసుకుని పోర్చుగల్ తరఫున ఆడే అర్హత సాధించాడు.గత నెలలోనే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 39 ఏళ్ల హెన్రిక్స్, తన జన్మభూమి అయిన పోర్చుగల్‌కు ఆడాలనే నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే కేవలం ఆటగాడిగానే కాకుండా బోర్డు అతనికి ఏకంగా జట్టు నాయకత్వ పగ్గాలను అప్పగించింది.ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ టోర్నీ ఫైనల్ గెలిచిన జట్టు యూరోపియన్ రీజినల్ క్వాలిఫయర్ రౌండ్‌కు చేరుకుంటుంది. అక్కడ స్కాట్లాండ్, జెర్సీ, డెన్మార్క్ వంటి బలమైన జట్లతో పోటీపడి టాప్-2లో నిలిస్తే గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగబోయే ప్రధాన టీ20