
ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్ 7 ధర రూ. 71,990కి తగ్గింపు RTX 3050 ప్రాసెసర్,16GB ర్యామ్ అందిస్తుంది బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు Flipkart Freedom Sale 2026 : మంచి గేమింగ్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా అనేక కేటగిరీల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏసర్ ఆస్పైర్ 7 A715-79G ల్యాప్‌టాప్ కూడా భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD ఎన్విడియా జిఫోర్స్ RTX 3050 గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌తో 15.6-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే ఉంది. సాధారణ గేమర్లకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ గేమింగ్ ల్యాప్‌టాప్ డీల్ : ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ ధర రూ.129,990 కాగా, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా రూ.71,990కే కొనుగోలు (Flipkart Freedom Sale 2026) చేయవచ్చు. లిస్ట్ ధర, సేల్ ధర మధ్య రూ.58వేలు వ్యత్యాసం ఉంది. అంటే.. సుమారుగా 45 శాతం తగ్గింపు అందిస్తుంది. సాధారణంగా ఈ సేల్ ధర రూ.90వేల నుంచి రూ.1 లక్ష మధ్య ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ.5,025 వరకు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.3,600 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. Read Also : Moto G37 Power Price : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G37 పవర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే? మీ పాత ల్యాప్‌టాప్ ఎక్స్ఛేంజ్ కోసం రూ.6వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తుంది. అయితే, మీ దగ్గర పాత ల్యాప్ టాప్ ఉంటే వర్కింగ్