© 2026 nimisham.in

నడిరోడ్డుపై యువకుడికి చిత్రహింసలు

మెకానిక్ సహా ఐదుగురి అరెస్ట్

ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

Bhogapuram Incident: విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram Incident)లో మానవత్వాన్ని తలదన్నే అత్యంత దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. బైక్ రిపేర్ చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ యువకుడిపై మెకానిక్ మహేశ్ విపరీతమైన దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడి మెడకు, చేతులకు తాళ్లు కట్టి, నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా.. ఆ తర్వాత బైక్కు కట్టి దారుణంగా ఈడ్చుకెళ్లాడు. రామచంద్రరాజుపేటకు చెందిన ఈ యువకుడి పట్ల స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

Mallu Ravi: కాంగ్రెస్లో క్రమశిక్షణ వేటు.. నలుగురు సీనియర్లకు షోకాజ్ నోటీసులు.. మల్లు రవి సంచలన నిర్ణయం

ఐదుగురు నిందితుల అరెస్ట్.. జిల్లా ఎస్పీ దామోదర్ ప్రకటన:

ఈ ఘాతుకానికి పాల్పడిన మెకానిక్ మహేశ్తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. బాధితుడిని చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు తీవ్రమైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు:

మానవ హక్కులను కాలరాస్తూ నడిరోడ్డుపై ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడటం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివాదాలైనా చట్టపరంగా పరిష్కరించుకోవాలి తప్ప, సొంతంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిందితులకు తగిన శాస్తి జరిగేలా కఠిన శిక్ష పడేలా చూస్తామని, బాధితుడికి పూర్తి న్యాయం అందిస్తామని జిల్లా పోలీస్ యంత్రాంగం హామీ ఇచ్చింది.