© 2026 nimisham.in

ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 - సీజన్ 2 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఎఫ్డీసీ ఎండీ, జీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలకు చోటు కల్పించారు. ఈ పోటీలను యువ ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ..'ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని' అని అన్నారు. ఈ పోటీలకు పంపే లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఉండనుంది. వీటితో పాటు మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేయనున్నారు. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ
Aug 22 2026 7:27 PM | Updated on Aug 22 2026 7:27 PM
ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 - సీజన్ 2 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఎఫ్డీసీ ఎండీ, జీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలకు చోటు కల్పించారు. ఈ పోటీలను యువ ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ..'ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని' అని అన్నారు.
ఈ పోటీలకు పంపే లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఉండనుంది. వీటితో పాటు మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేయనున్నారు.
ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)
చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు)
బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు
శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు
గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు
చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది..
ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు
నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి
జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?