
భారతదేశం నుంచి అత్యున్నత స్థాయి మార్షల్ ఆర్ట్స్ కళాకారులు అరుదుగా వస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంఎంఏ ప్రాడిజీగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ 2026లో స్కేట్స్‌పై గట్కా ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించాడు. సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ అయిన గట్కాను స్కేట్స్‌పై ప్రదర్శించిన మొట్టమొదటి చిన్నారిగా ఫతే చరిత్ర సృష్టించాడు.సాధారణంగా చిన్న పిల్లలు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నేర్చుకునే వయసులో, ఫతే మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. అతని ప్రయాణం కేవలం రెండేళ్ల వయసులోనే ప్రారంభమైంది. అతని చేతి కదలికల్లోని ప్రత్యేకతను తల్లిదండ్రులు గమనించి, ఆ దిశగా ప్రోత్సహించారు. ఫతే తండ్రి రమణ్‌దీప్ కూడా ఒక అథ్లెట్. యూరప్‌లో బాడీబిల్డింగ్ పోటీలలో పాల్గొన్నారు. తన కొడుకు కూడా క్రీడల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. రెండేళ్ల వయసులోనే ఫతే మణికట్టు కదలికలు గట్కాకు సరిగ్గా సరిపోతాయని గుర్తించి, ప్రత్యేకంగా ఓ కిర్పాన్ (సిక్కులు ధరించే కత్తి) తయారు చేయించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో ఫతే తల్లి నవప్రీత్ కౌర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఫతే కడుపులో ఉన్నప్పుడు మంచి పనులు చేయాలని మా అమ్మ చెప్పేవారు. అది బిడ్డ భవిష్యత్తుకు మేలు చేస్తుందని అనేవారు" అని ఆమె గుర్తుచేసుకున్నారు. రెండేళ్ల వయసులోనే ఫతే మతపరమైన ఛానళ్లలో గుర్బానీని శ్రద్ధగా వినేవాడని తెలిపారు