టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో పర్యటించారు.. ఆయన ఇనార్బిట్ మాల్లో ఏఏఏ సినిమాస్ థియేటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన AP 40 LE 1 నంబరు ఉన్న ల్యాండ్ క్రూయిజర్ కారు ఎవరిదనే చర్చ జరుగుతోంది. ఇదే కారును అల్లు అర్జున్‌తో పాటుగా రాంచరణ్ కూడా ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ఉపయోగించారు. రాంచరణ్ జూన్‌లో మంగళగిరి స్టేడియంలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ఇదే కారులో వచ్చారు.అల్లు అర్జున్, రాంచరణ్ ప్రయాణించిన AP 40 LE 1 నంబరు ఉన్న ల్యాండ్ క్రూయిజర్ కారులో వెళ్లారు. ఈ కారు గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆరా తీశారు.. అయితే ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుదిగా తెలిసింది. విశాఖపట్నాకి మెగా కుటుంబసభ్యులు ఎవరొచ్చినా గంటా శ్రీనివాసరావు వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారు. అందుకే రాంచరణ్, అల్లు అర్జున్ తమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గంటా శ్రీనివాసరావుకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఉపయోగించారు.విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్లో ఏఏఏ సినిమాస్ థియేటర్లను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఎనిమిది స్క్రీన్లలో ఏడు ప్రారంభంకాగా.. త్వరలో మరో స్క్రీన్ అందుబాటులోకి రానుంది. విశాఖపట్నంలో అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.. బైక్‌లపై విమానాశ్రయం నుంచి ఇనార్బి్ట్ మాల్ వరకు ర్యాలీగా వచ్చారు. అభిమానులు భారీగా తరలిరావడంతో మాల్ లోపలికి అనుమతించలేదు. అల్లు అర్జున్ మధ్యాహ్నం 1 గంటకు రాగా.. దాదాపు రెండు గంటల పాటు మాల్లోనే ఉన్నారు. అక్కడ థియేటర్ ప్రాంగణంలో పుష్ప విగ్రహం ఏర్పాటు చేశారు.. ఆయన ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫొటో దిగారు. ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు.భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని