© 2026 nimisham.in

దిల్లీ: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్ట్‌కు మాజీ ఐపీఎస్ (Ex IPS Officer) అధికారి అమితాబ్ ఠాకూర్ (Amitabh Thakur) దరఖాస్తు చేసుకున్నారు. ఆ పదవి కోసం అమితాబ్ ఠాకూర్ పోటీకి దిగడం యూపీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే..? 1992 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి ఠాకూర్‌పై పలు శాఖాపరమైన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2021 మార్చి 23న అతడిని పదవీ విరమణ చేయించింది. ఆయన పదవీ కాలం 2028 వరకు ఉన్నప్పటికీ.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఐపీఎస్ స్థానం నుంచి తప్పిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఆ పదవిలో కొనసాగించడానికి ఆయన అనర్హుడని తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఠాకూర్ ‘అధికార్ సేన’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసే వ్యక్తులను అయోధ్య ఆలయ సీఈఓ (Ram Mandir CEO Post)గా నియమించడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్ధమవుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో మూడేళ్ల పదవీకాలానికి సీఈవోను నియమిస్తామని, పనితీరు ఆధారంగా తర్వాత పొడిగింపు ఉంటుందని పేర్కొంది. ట్రస్ట్ నిర్ణయాలను అమలు చేయడం, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం వంటి బాధ్యతలను కొత్త సీఈఓ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇప్పుడే ఉత్తర్వులు ఇవ్వలేం: భోజ్‌శాల కేసులో సుప్రీంకోర్టు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం
బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్‌కు ఆనుకుని ఉన్న రామ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన ఎగిరే ఉడత చాలా ఏళ్ల తర్వాత కనిపించింది.
ఉత్తరాఖండ్ దేహ్రాదూన్‌లోని మసూరీలో మంగళవారం ఉదయం సుందర దృశ్యం ఆవిష్కృతమైంది.
పిల్లలు బడికి వెళ్లాలంటే నెత్తిన బ్యాగ్ పెట్టుకొని నడుము లోతు నీటిలో నడుచుకుంటూ నది దాటాల్సిందే.