
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆమె చెప్పిన సంగతులివే.. *మీ జర్నీ గురించి చెప్పండి?* నేను 2019లోనే కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాయి. కానీ అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకోవడం, సినిమాలు చేస్తున్న ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది. *మీ పాత్ర ఎలా ఉంటుంది?* ‘అమీర్ లోగ్’ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళలకు స్పూర్తినిచ్చేలా నా కారెక్టర్ ఉంటుంది. మా అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమాలోని పాత్ర కూడా అలానే ఉంటుంది. ముక్కు సూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. ఈ కారెక్టర్లో కూడా ఇలానే ఉంటాను. *‘అమీర్‌లోగ్’లో అవకాశం ఎలా వచ్చింది?* ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టుగా మా దర్శకుడు రమణ గారికి తెలీదు. బషీర్ మాస్టర్ మాకు ఈ మూవీ ఆడిషన్స్ గురించి చెప్పారు. నేను ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో రమణ గారు వెంటనే ఓకే చెప్పారు. *ఇప్పటి వరకు ‘అమీర్ లోగ్’ చూసిన వారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి?* ‘అమీర్ లోగ్’ సినిమా చూసిన