© 2026 nimisham.in

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Eshwar Sai Controversy:‘బాసింగ బలాలు’ ఫోక్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు, నటుడు ఈశ్వర్ సాయి పేరు ప్రస్తుతం ఓ వివాదంలో వినిపిస్తోంది. వేములవాడలో మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఆయన ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తన భర్తతో మరో మహిళ సన్నిహితంగా ఉంటోందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన భర్తకు ఏడేళ్లుగా వివాహం జరిగిందని, ఆయన మంచివాడని ఆమె మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంలోకి ఫోక్ యాక్ట్రెస్ వైష్ణవి సోనీ పేరును కూడా కొందరు తీసుకురావడంతో ఆమె స్పందించారు. తనకు ఈ వ్యక్తిగత వివాదంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగవద్దని కోరారు. వైష్ణవి సోనీ సోషల్ మీడియాలో ఒక స్టోరీ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పాట లేదా వీడియోను ఆధారంగా చేసుకుని తన గురించి కథనాలు తయారు చేయవద్దని ఆమె కోరారు. తన పని తాను చేసుకుంటున్నానని, ఇతరుల వ్యక్తిగత జీవితంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాగే తన క్యారెక్టర్‌పై ఎవరూ కామెంట్లు చేయవద్దని, తన ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు. తన పేరును ఈ వివాదంలోకి తీసుకురావడం వల్ల ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పకనే చెప్పారు
.
ఇక ఈశ్వర్ సాయి ‘బాసింగ బలాలు’ పాటతో ఫోక్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవి సోనీతో కలిసి ఆయన నటించిన ఈ పాటకు భారీ స్పందన వచ్చింది. పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లో కూడా ఈ పాట వినిపిస్తూ పాపులర్ అయింది.
ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఆరోపణలపై పూర్తి వివరాలు అధికారికంగా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అదే సమయంలో ఈ వివాదంతో సంబంధం లేని వారిని అనవసరంగా ఇందులోకి లాగడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈశ్వర్ సాయి వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తనకు సంబంధం లేదని వైష్ణవి సోనీ స్పష్టంగా చెప్పడంతో ఈ అంశంపై మరింత చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.