© 2026 nimisham.in

ఆరో సారి ఫిఫా వరల్డ్‌కప్ గెలవాలనుకున్న మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ఆశలు అడియాశలయ్యాయి. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ బ్రెజిల్ ఆశలను అడియాశలు చేశాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌పై నార్వే 2-0 గోల్స్ తేడాతో గెలుపొంది, తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ దెబ్బతో బ్రెజిల్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో నార్వే ఇంగ్లండ్ లేదా మెక్సికోతో తలపడుతుంది. ఒంటికాలితో తన్నేశాడు..! బ్రెజిల్ ప్రపంచకప్ కలను హాలాండ్ ఒంటికాలితో తన్నేశాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో (80, 90) లభించిన రెండు అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ నమోదు చేశాడు. దీంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రక విజయం సాధించింది. బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ కల చెదిరిపోయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ అటాకింగ్ కంటే డిఫెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు నార్వే దూకుడుగా ఆడి బ్రెజిల్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ జట్టు తరఫున హాలాండ్, మార్టిన్ ఓడెగార్డ్, పాట్రిక్ బెర్గ్, ఆండ్రియాస్ షెల్డెరప్ అద్భుతంగా ఆడారు. వరుసగా ప్రమాదకర దాడులు చేశారు. 78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా, బ్రెజిల్ కేవలం 203 పాస్‌లతోనే సరిపెట్టుకోవడం మ్యాచ్‌పై నార్వే ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. బ్రెజిల్‌కు సైతం అవకాశాలు వచ్చినా..! బ్రెజిల్‌కు సైతం మ్యాచ్‌లో పలు కీలక అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. బ్రునో గిమరాయెస్ కొట్టిన పెనాల్టీని గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లి ప్రయత్నాన్ని కూడా నైలాండ్ నిలువరించాడు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎండ్రిక్‌కు వినీషియస్ జూనియర్ అందించిన చక్కని అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చలేకపోయాడు. 68వ నిమిషంలో స్టార్ స్ట్రైకర్ నెయ్మార్ బరిలోకి దిగినా దాడుల్లో పెద్ద మార్పు రాలేదు. స్టాపేజ్ టైమ్‌లో (90+10) నెయ్మార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. 80
Jul 6 2026 7:21 AM | Updated on Jul 6 2026 7:30 AM
ఆరో సారి ఫిఫా వరల్డ్‌కప్ గెలవాలనుకున్న మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ఆశలు అడియాశలయ్యాయి. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ బ్రెజిల్ ఆశలను అడియాశలు చేశాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌పై నార్వే 2-0 గోల్స్ తేడాతో గెలుపొంది, తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ దెబ్బతో బ్రెజిల్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో నార్వే ఇంగ్లండ్ లేదా మెక్సికోతో తలపడుతుంది.
ఒంటికాలితో తన్నేశాడు..! బ్రెజిల్ ప్రపంచకప్ కలను హాలాండ్ ఒంటికాలితో తన్నేశాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో (80, 90) లభించిన రెండు అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ నమోదు చేశాడు. దీంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రక విజయం సాధించింది. బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ కల చెదిరిపోయింది.
ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ అటాకింగ్ కంటే డిఫెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు నార్వే దూకుడుగా ఆడి బ్రెజిల్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ జట్టు తరఫున హాలాండ్, మార్టిన్ ఓడెగార్డ్, పాట్రిక్ బెర్గ్, ఆండ్రియాస్ షెల్డెరప్ అద్భుతంగా ఆడారు. వరుసగా ప్రమాదకర దాడులు చేశారు.
78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా, బ్రెజిల్ కేవలం 203 పాస్‌లతోనే సరిపెట్టుకోవడం మ్యాచ్‌పై నార్వే ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.
బ్రెజిల్‌కు సైతం అవకాశాలు వచ్చినా..! బ్రెజిల్‌కు సైతం మ్యాచ్‌లో పలు కీలక అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. బ్రునో గిమరాయెస్ కొట్టిన పెనాల్టీని గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లి ప్రయత్నాన్ని కూడా నైలాండ్ నిలువరించాడు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎండ్రిక్‌కు వినీషియస్ జూనియర్ అందించిన చక్కని అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చలేకపోయాడు. 68వ నిమిషంలో స్టార్ స్ట్రైకర్ నెయ్మార్ బరిలోకి దిగినా దాడుల్లో పెద్ద మార్పు రాలేదు. స్టాపేజ్ టైమ్‌లో (90+10) నెయ్మార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.
80 నిమిషాలు నిశ్శబ్దం... చివరి 10 నిమిషాల్లో తుఫాన్ దాదాపు 80 నిమిషాల పాటు బ్రెజిల్ డిఫెండర్లు హాలాండ్‌ను సమర్థంగా కట్టడి చేశారు. కానీ 80వ నిమిషంలో షెల్డెరప్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను హాలాండ్ హెడర్‌తో గోల్‌గా మలిచి నార్వేకు ఆధిక్యం అందించాడు. 90వ నిమిషంలో బ్రెజిల్ మొత్తం ముందుకు రావడంతో ఏర్పడిన ఖాళీలను చాకచక్యంగా ఉపయోగించుకున్న హాలాండ్, బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన బుల్లెట్ షాట్‌ను గోల్‌గా మార్చి మ్యాచ్‌ను పూర్తిగా నార్వే వైపు తిప్పేశాడు.
నెయ్మార్ కన్నీళ్లు.. హాలాండ్ ఆనందభాష్పాలు ఫైనల్ విజిల్ అనంతరం నెయ్మార్ మైదానంలోనే నిలబడి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది అతని చివరి ప్రపంచకప్ మ్యాచ్ కావచ్చన్న నేపథ్యంలో ఆ దృశ్యం అభిమానులను కదిలించింది. మరోవైపు చారిత్రక విజయంతో హాలాండ్ మైదానంలోనే కుప్పకూలి ఆనందభాష్పాలు పెట్టుకున్నాడు. నార్వే అభిమానులు స్టేడియంలో చాలా సేపు సంబరాలు కొనసాగించారు.
మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)
ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)
బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అదరగొట్టిన ఆసీస్.. 7వ సారి T20 వరల్డ్ కప్
ప్రశ్న రావణ్ చచ్చిపోవాలి అంటా..? 20 మంది పెద్ద పెద్ద లాయర్లను పెట్టి..
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
14 రోజులు రిమాండ్.. నెల్లూరు జైలుకు ప్రశ్న రావణ్
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో...