EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారులకు ఆన్లైన్ భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో పీఎఫ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఉద్యోగులను ఈపీఎఫ్ఓ అప్రమత్తం చేసింది. ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్త వహించాలని, వాటి బారిన పడొద్దని సూచించింది. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింక్‌లను నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది.సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే నకిలీ లింకులు, ఇ-మెయిల్స్ ను ఓపెన్ చేయవద్దని కోరింది. ఇటీవల ఈపీఎఫ్ఓ సిస్టమ్ అప్ గ్రెడేషన్ చేసింది. ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు ఉద్యోగులకు తెలియజేసింది. సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు 6 ముఖ్యమైన సూచనలు చేసింది.సూచనలు ఇవే అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ మాత్రమే సందర్శించాలి సోషల్ మీడియా, ఎస్ఎంఎస్ లేదా ఇ-మెయిల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో కాకుండా ఇతర ఏ ప్లాట్ ఫామ్‌లో యూఏఎన్, పీపీఓ, పాస్వర్డ్, పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలను ఇవ్వవద్దు అకౌంట్ లాగిన్ అయ్యో ముందే సైట్ యూఆర్ఎల్ స్పెల్లింగ్, డొమైన నేమ్ చెక్ చేయాలి అనుమానాస్పద సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్‌కు, సైబర్ సెక్యూరిటీకి రిపోర్ట్ చేయాలి. ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఓటీపీలు, లాగిన్ వివరాలు అడగదని గుర్తుంచుకోవాలి.అధికారిక వెబ్సైట్ లింకులు ఇవే..ఈపీఎఫ్ఓకు చెందిన మూడు అధికారిక వెబ్సైట్ లింకులను ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పంచుకుంది. ఈపీఎఫ్ఇండియా