
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని ఆప్యాయంగా పలకరించి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో కళ్లలో నీళ్లు తిరుగుతున్నా కేసీఆర్ ఆ దుఃఖాన్ని దిగమింగుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భరోసా కల్పించారు.కొత్త పింఛన్లపై కొత్త అప్డేట్..మొదట ఇచ్చేది వారికే,మొదలైన దరఖాస్తుల ప్రక్రియ!కేసీఆర్ నల్లబెల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తరవచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు భారీగా తరలిరావడంతో స్వల్ప తోపులాట జరగగా.. పోలీసులు కేసీఆర్ కాన్వాయ్ ను సుదర్శన్ రెడ్డి నివాసంలోకి తీసుకెళ్లారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు. రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షల చెక్ రాసి వారికి అందజేశారు. అనంతరం నల్లవెల్లి నుంచి ఎర్రవెల్లకి తిరుగు ప్రయాణం అయ్యారు