© 2026 nimisham.in
కాలేజీ లాకర్లు పగలగొట్టి.. కోటి రూపాయలు కొల్లగొట్టి..! ఏలూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రముఖ రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ కలకలం రేపింది. ఆరు నుండి ఏడుగురు సభ్యులు గల దొంగల ముఠా కళాశాల వెనుక భాగం నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని ఎండి రూమ్‌లోకి చొరబడింది. అక్కడ ఉన్న లాకర్ బీరువాని బయట మైదానంలోకి తీసుకువచ్చి, బండరాళ్లతో పగలగొట్టి సుమారు కోటి రూపాయల మేర నగదును దోచుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న మరో లాకర్లోని రూ.70 లక్షల నగదును దొంగలు గమనించకపోవడంతో ఆ మొత్తం సురక్షితంగా మిగిలింది. ప్రస్తుతం కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలో క్యాష్ ఉన్నట్లు సమాచారం. ఈ చోరీ జరిగిన విధానాన్ని ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘోరానికి పాల్పడింది మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్రకు చెందిన ప్రమాదకరమైన 'ధార్ ముఠా' (Dhar Gang) సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వార్తకు సంబంధించిన