
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద ఏడాది కాలంలో భారీగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 320 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.27 లక్షల కోట్లకు పైగా. రోజుకు సగటున 875 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,700 కోట్లు) చొప్పున ఆయన సంపద పెరిగినట్లు బెస్ట్‌బ్రోకర్స్ విశ్లేషణ వెల్లడించింది.ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ జాబితాను ఆధారంగా చేసుకుని ఈ విశ్లేషణ చేశారు. 2025 జులై 27న, 2026 జులై 27న ప్రపంచ కుబేరుల సంపదను పోల్చి చూశారు. గత ఏడాది కృత్రిమ మేధ, టెక్నాలజీ రంగాల్లో భారీ వృద్ధి కనిపించింది. దీంతో ఈ రంగాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తల సంపద గణనీయంగా పెరిగింది.మస్క్ తర్వాత అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తిగా డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ నిలిచారు. ఆయన సంపద ఏడాదిలో 107.6 బిలియన్ డాలర్లు పెరిగింది. డీప్‌సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ సంపద 2025లో 1 బిలియన్ డాలర్ల నుంచి 2026లో 39.5 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే ఏడాదిలో ఏకంగా 3,850 శాతం పెరిగింది. దీంతో ఆయన ప్రపంచంలోని టాప్-50 కుబేరుల జాబితాలో చేరారు.మస్క్ తొలిసారి 2021లో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. అప్పటి నుంచి ఆయన సంపద కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ 18 ఏళ్లలోపు కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం చదివారు.ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థ విలీనంతో మస్క్