© 2026 nimisham.in

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SIR Draft: తెలంగాణలో ఓట్ల సవరణ కార్యక్రమం (సర్) ముగిసింది. ఓటర్ల నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. ఎంత మంది తమ ఓటు హక్కును అప్డేట్ చేసుకున్నారనే అంశాలను ఎన్నికల సంఘం (ఈసీ) వివరించింది. సర్ ప్రక్రియలో కీలకమైన ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదాలో ఎంత మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు? ఎంత మంది ఓట్లు తొలగిపోతున్నాయనేది ఎన్నికల సంఘం సమగ్ర నివేదిక విడుదల చేసింది. 2,64,87,213 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించినట్లు ఈసీ ముసాయిదాలో తెలిపింది. అంటే 78.30 శాతం ఫారాలు సేకరణ జరిగింది. 9,22,229 మంది ఓటర్లు మృతిచెందిన వారిగా గుర్తించగా.. వారి ఓట్ల శాతం 2.73 గా ఉంది. 57,46,803 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, అందుబాటులో లేని లేదా ఇతర కేటగిరీల్లో ఉన్నట్లు గుర్తించగా వారి ఓట్ల శాతం 16.99 ఉంది. 6,70,203 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో నమోదైనట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. నిజమైన ఓటర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరేందుకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల ప్రక్రియలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం చేపట్టిన సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్‌కు 25 జూన్ 2026 నుంచి 10 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇచ్చారు. సర్ ఎన్యుమరేషన్ ఫలితాల్లో ఎలక్టర్ల నుంచి సేకరించిన ఫారాలు 2,64,87,213. అంటే 78.30 శాతం
. మరణించిన ఓటర్లు 9,22,229 మంది ఉండగా.. ఓట్ల శాతం 2.73. ఇక శాశ్వతంగా తరలిపోయారు/ కనిపించలేదు / ఇతరులు 57,46,803 మంది ఉన్నారు. వారి ఓట్ల శాతం 16.99. వీరిని బీఎల్ఓలు కలవలేకపోవడానికి కారణాలు ఈసీ వెల్లడించింది. వారంతా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం.. కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటర్లుగా మారారని.. ఉనికిలో లేరని.. ఆగస్టు 10 వరకు ఫారం సమర్పించలేదని.. ఏదో కారణంతో ఓటరుగా నమోదు చేయడానికి ఇష్టపడలేదు అని కారణాలుగా ఈసీ తెలిపింది. ఓటర్ జాబితాలో పలుచోట్ల నమోరైన వారి సంఖ్య 6,70,203. వీరి శాతం 1.98 ఉంది.
విడుదల చేసిన ముసాయిదాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. 17 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలపై వినతులు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. నిజమైన ఓటర్లు ఫామ్ 6 + డిక్లరేషన్ ఫారంతో మళ్లీ ఓటర్ జాబితాలో పేరు చేర్పించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరున్న ఓటర్ల పేరు ఒకే చోట మాత్రమే ఉంచుతామని ఈసీ స్పష్టం చేసింది.
సర్ ప్రక్రియలో ఓటర్లు, రాజకీయ పార్టీలతోపాటు తమ సిబ్బంది భాగమయ్యారని ఈసీ తెలిపింది. తెలంగాణలో ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో అర్హులైన ఓటర్లు భాగస్వామ్యం కావడంతో పూర్తి పారదర్శకంగా చేసినట్లు ఈసీ వెల్లడించారు. 10 ఆగస్టు 2026 నాటికి మొత్తం 3,38,26,448 ఓటర్లలో 2,64,87,213 మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారని ఈసీ తెలిపింది. ఈ పని కోసం 33 జిల్లాల డీఈఓలు, 119 ఈఆర్ఓలు, 892 ఏఈఆర్ఓలు, 3,590 బీఎల్ఓ సూపర్వైజర్లు, 35,985 పోలింగ్ స్టేషన్లలో 35,985 బీఎల్ఓలు పనిచేశారని ఈసీ వెల్లడించింది.
బీఆర్ఎస్ పార్టీ అత్యధికం సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా కీలక భాగస్వామ్యం చేశాయి. ఎన్యుమరేషన్ సమయంలో రాజకీయ పార్టీలు మొత్తం 49,018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) నియమించుకోగా.. అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మొత్తం 20,394 మంది బీఎల్ఏలను నియమించి సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని ఓటర్లను భాగస్వామ్యం చేసింది.
పార్టీల వారీగా బీఎల్ఏల సంఖ్య భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ): 20,394 భారత జాతీయ కాంగ్రెస్ :13,144 భారతీయ జనతా పార్టీ-బీజేపీ: 11,621 ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం): 2,382 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)- సీపీఐ (ఎం): 608 బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 569 తెలుగు దేశం పార్టీ : 300
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), ఆమ్ ఆద్మీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఒక్క బీఎల్ఏను కూడా నియమించలేదు. తెలంగాణ సర్ ప్రక్రియలో వాటి పాత్ర ఏమీ లేదు.