
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: కళల రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరం నగరంలో ఎందరో రంగస్థల కళాకారులు, సినీ నటులు, రచయితలు, దర్శకులు ఉన్నారు. గోదారి తీరంలో జన్మించిన వారు కొందరు.. ఈ ప్రాంతంలో కొంతకాలం నివాసం ఉన్నవారు మరికొందరు.. సినీ పరిశ్రమలో నిలదొక్కుకుని అగ్రస్థానంలో రాణించారు. వారిలో ప్రముఖ నటి షావుకారు జానకి తన నటనతో ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. జానకి చిన్నతనంలో ఆమె తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం రాజమహేంద్రవరంలో ఉన్నారు. షావుకారు జానకి తండ్రి పేపరుమిల్లులో పని చేశారు. 1940లో కుటుంబంతో రాజమహేంద్రవరం వచ్చారు. గోకవరం బస్స్టాండ్ సమీపంలో అద్దెఇంట్లో ఉండేవారు. జానకి, ఆమె చెల్లి కృష్ణకుమారి ఇక్కడ కొంతకాలం చదువుకున్నారు. 1947లో ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత కాలంలో జానకి పెళ్లి జరగడం, సినిమాల్లో అవకాశం రావడంతో చెన్నై వెళ్లారు. సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన షావుకారు చిత్రం విజయవంతం కావడంతో అందరూ షావుకారు జానకిగా గుర్తిస్తూ అదే పేరుతో పిలుస్తున్నారు. ఆమె మరణం చిత్రసీమకు తీరని లోటు. శ్రీపాద జిత్మోహన్మిత్రా, నటుడు, గాయకుడు, రాజమహేంద్రవరం పాత్ర ఏదైనా తన సహజ నటనతో మెప్పిస్తూ షావుకారు జానకి జీవం పోసేవారు. స్పష్టమైన సంభాషణ, భావవ్యక్తీకరణతో ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా నిలిచారు. మొదట రేడియో నాటికల్లో రాణించారు. ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. నల్లి రవికుమార్, నాటక రచయిత, అధ్యాపకుడు, రాజమహేంద్రవరం సీనియర్ నటి షావుకారు జానకి మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వైవిధ్య పాత్రలతో మెప్పించి, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి