
అమలాపురం డివిజన్లోని ఓ పాఠశాల బీరువాలో సామగ్రి న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎంశ్రీ పథకంలో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులకు సైన్స్ పరిశోధనలపై ఆసక్తి పెంచేలా ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రయోగశాలలు (ల్యాబ్లు) మంజూరు చేశారు. ఆయా పాఠశాలలకు పరికరాలు వచ్చినప్పటికీ వాటిని వినియోగించకుండా నేటికీ అట్టపెట్టెల్లోనే ఉంచారు. దీంతో లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాం. వీలైనంత త్వరగా ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.