
గండేపల్లి: నీటిని వృథా చేయకుండా అరికట్టి, ఆకాశం నుంచి వచ్చే ప్రతి నీటిచుక్కని పొదుపు చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ జేఈ ప్రపుల్ కుమార్ అన్నారు. మంగళవారం గండేపల్లి మండలం జడ్ రాగంపేట, నీలాద్రిరావుపేట గ్రామాల్లోని పంటకాలువలను, చెరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ.. జలసంఛాయ్- జన్ భగీధరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతలు, చెరువుల్లో పూడికలు తీయడం, కాలువలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. గతంలో చేసిన పనులను మూడు రోజులపాటు పెద్దాపురం డివిజన్లో పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సామర్లకోట, గండేపల్లి, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల్లో పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ భానుప్రకాష్, ఎంపీడీవో, ఏపీవో, టెక్సికల్ సిబ్బంది పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.