
ఇంటర్నెట్ డెస్క్: అతను రాజవంశానికి చెందిన వాడు. ఏదో సాదాసీదా వంశం కాదు. బ్రిటన్ రాజు ఛార్లెస్ 3కు స్వయానా సోదరుడైన ప్రిన్స్ ఎడ్వర్డ్ కుమారుడు. అతని పేరు జేమ్స్. వయస్సు 18 ఏళ్లు. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. తన పెదనాన్న రాజు ఛార్లెస్‌కు చెందిన సాన్డ్రిన్గ్హం వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్నట్టు ఆ దేశానికి చెందిన మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ క్షేత్రంలో పనిచేసే ఇతర సిబ్బంది జేమ్స్ గురించి పలు విషయాలు వెల్లడించారు. అతను రాజవంశానికి చెందినప్పటికి అందరితో పాటు వ్యవసాయపనులు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతున్నట్టు వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలను జేమ్స్ బాగా అధ్యయనం చేస్తున్నట్టు వారు తెలిపారు. కష్టమైన పనులను సైతం చేస్తున్నటు తెలుస్తోంది. సెలవుల అనంతరం ఉన్నత విద్యకు వెళ్లనున్నట్టు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. కొన్నేళ్ల క్రితం ఆయన సోదరి లూయిస్ విండ్సర్ కూడా ఒక ఉద్యానవనంలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతున్నారు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష రాజుకు చిన్న సోదరుడు ఎడ్వర్డ్, సోఫీ ఆయన సతీమణి. వీరికి ఇద్దరు సంతానం. లూయిస్, జేమ్స్‌లు. జీవించేందుకు ఏదైనా పని చేయాలని తమ సంతానానికి సూచించారు. తమ ఆస్తుల నుంచి ఆదాయం ఉన్నా జీవనం సాగించేందుకు అవసరమైన వేతనాన్ని పొందేందుకు అవసరమైన పనులు చేయాలని తల్లి సోఫీ చెప్పారు. రాజకుటుంబం నుంచి వచ్చే గౌరవ వాచకాలను వినియోగించాలా? వద్దా అన్నదానిపై విచక్షణను పిల్లలకే వదిలిపెట్టినట్టు చెప్పారు. ఎడ్వర్డ్ గతంలో బ్రిటన్ సైన్యం బాధ్యతలు నిర్వహించారు. సోఫీ దాదాపు 70 ఛారిటీల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దివ్యాంగులు, యువత, వ్యవసాయం, సమానత్వం.. తదితర రంగాల్లో సేవలందించే సంస్థలకు ఆమె చేయూతనిస్తున్నారు. నిధుల సేకరణకు పలు కార్యక్రమాలు నిర్వహస్తుంటారు. వాటి ద్వారా సంస్థలకు ఆర్థిక సాయం చేస్తుంటారు. వీరి సింప్లిసిటీని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో