
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ మూవీకి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన తాజాగా అనౌన్స్ చేశారు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఉద్దేశంతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. భారీ స్థాయిలో విడుదల ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్లే వాయిదా వేశారని అర్థమవుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మిస్కిన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌పై జూనియ్ ఎన్టీఆర్ సైతం ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే? LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET