
Dora Sai Teja : పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటుడిగా, డబ్బింగ్ లతో చిన్న వయసులోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు దొర సాయి తేజ. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల దొర సాయి తేజ హీరోగా దందా అనే వెబ్ సిరీస్ వచ్చింది. చాయ్ షాట్స్ ఓటీటీలో వర్టికల్ వెబ్ సిరీస్ గా దందా వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దందా వెబ్ సిరీస్ సక్సెస్ అనంతరం దొర సాయి తేజ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. దొర సాయి తేజ తన గురించి చెప్తూ.. ప్రభాస్ అడవి రాముడు సినిమాతో పాటు చాలా సినిమాలకు, కొన్ని కార్టూన్స్ కి డబ్బింగ్ తో కెరీర్ మొదలుపెట్టాను. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాను. 2016లో ఆర్జీవీ పరిచయంతో సినిమా, యూట్యూబ్ లో కంటెంట్ మొదలయింది. గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీ కూడా మొదలుపెట్టాను. వ్యాపారస్థుడిగా, నటుడిగా, కంటెంట్ క్రియేటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాను. కంటెంట్ క్రియేషన్ నా బిజినెస్. సినిమా నా ప్యాషన్. ఈ రెండూ కలిపితే నేను అని తెలిపారు. తనకు ఫేమ్ తెచ్చిపెట్టిన సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రతీ వీడియోకి ప్రశంసలు, తిట్లు వస్తాయి. ఇక్కడ నా ఫాలోయింగ్‌ని నా కోసం సినిమా థియేటర్ వరకు తీసుకు రావాలని అనుకుంటున్నాను. కొద్దిగా ఫాలోవర్లు, లైకులు, షేర్లు కనిపించాయంటే చాలు చూసే జనాలంతా ‘లైఫ్ అంటే వీడిది రా’ అనుకుంటారు. కానీ కాదు. వైకుంఠపాళీ లాగా నిచ్చెనెక్కిచ్చేది, తేడా కొడితే క్రింద పడేసేది అదే దీంట్లోకి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రశంసకీ విమర్శకీ రెండింటికి సిద్ధంగా ఉండాలి. నేను చేసిన కంటెంట్‌లో నా ఫాలోవర్స్ వాళ్లని వాళ్లు చూసుకుని కనెక్ట్ అయ్యారు. మీరు ఫాలో అయ్యే ఇన్‌ఫ్లూయన్సర్ ఏం పోస్టు