
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మరో ఉన్నతస్థాయి సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నాటికి కిమ్ తో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.నవంబర్‌లో చైనాలోని షెన్జెన్లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా ఈ భేటీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సమావేశంపై అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, దీనికి ఉత్తర కొరియా అంగీకరిస్తుందా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. 'తగిన సమయంలో' ఇద్దరు నేతలు కలుస్తారని ఆయన పేర్కొన్నారు.ఇటీవల దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను ట్రంప్ గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కిమ్‌తో తనకున్న సంబంధాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తన పిలుపునకు కిమ్ ఎందుకు స్పందించడం లేదని సోమవారం మీడియా ప్రశ్నించగా.. 'ఆయన ఇప్పటికే స్పందించారు' అని ట్రంప్ బదులిచ్చారు. ఆ స్పందన 'చాలా సానుకూలంగా' ఉందని, అయితే మరిన్ని వివరాలు చెప్పలేదు. కిమ్ తనను ఎప్పుడూ గౌరవంగా చూస్తారని, ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని ట్రంప్ పునరుద్ఘాటించారు.ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కిమ్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. 2018లో సింగపూర్, 2019లో హనోయ్, అదే ఏడాది కొరియాల సరిహద్దులో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఉత్తర కొరియా నేతతో సమావేశమవడం అదే మొదటిసారి. అప్పట్లో అణ్వస్త్ర