.. అమెరికాలో ఉపాధి పేరుతో స్థిరపడేందుకు ప్రయత్నించేవారికి డొనాల్డ్ ట్రంప్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఆ దేశ అధ్యక్షుడికైనా వారి దేశమే ప్రథమం. ఇందులో ట్రంప్‌ను తప్పుపట్టాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమెరికా వెళ్లానుకునే వారు పొందాలనుకునే H-1B వీసా ఫీజు లక్ష డాలర్లు చేయడంతో ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోయారు. అమెరికా పోవడం ఎందుకనే పరిస్థితికి తీసుకొచ్చారు. వలసల విధానాలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీసాల రద్దు చేసి కఠినమైన వలస విధానాలను అమలు చేశారు. వీసా అపాయింట్మెంట్లు, ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం వివాదాస్పదమైంది. భారత్ సహా పలు దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై అదనపు సుంకాలు విధించడం ద్వారా వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం.. పారిస్ వాతావరణ ఒప్పందం, పలు గ్లోబల్ ట్రేడ్ డీల్స్ నుంచి అమెరికాను వెనక్కి తీసుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. విద్యాశాఖ వ్యవస్థను బలహీన పరిచేలా మరియు ప్రక్షాళన చేసేలా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కొత్త నిబంధనలతో భారత ఐటీ నిపుణులకు చుక్కలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులను బెంబేలెత్తిస్తున్నాడు. రకరకాల ఆంక్షలతో వలసల నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు. అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిబంధన ప్రకారం.. H-1B వీసా ఫీజు ఏకంగా 1,03,265 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. గతంలో 1 లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. దిగుమతులపై సుంకాలు.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు సంచలనంగా మారాయి. వాణిజ్యం, విదేశీ సంబంధాలు, ఇమిగ్రేషన్ తదితర రంగాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. అమెరికా దిగుమతి చేసుకునే వస్తుఉత్పత్తులపై ఇష్టారాజ్యంగా పన్నులు విధించారు. వందశాతం పన్నులతో ప్రపంచ దేశాలను దడపుట్టించాడు. ఆ ప్రభావంతో భారత్ దేశానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రంప్ పన్నులు విధించడాన్ని అమెరికా కోర్టు తప్పుబట్టింది. చివరగా ఆ దేశ పౌరులే ఎక్కువ రేటు పెట్టి వస్తువులను కొనుక్కోవాల్సిన పరిస్థితులు కల్పించాడు. కొన్ని రోజుల తర్వాత పన్నుల శాతాన్ని తగ్గిస్తూ వచ్చారు. చదువుకోసం వెళ్లిన విద్యార్థులు చదువుతూ పార్ట్ టైమ్ పనిచేసుకునే వారిని, చదువు పూర్తయిన తర్వాత రకరకాల వర్క పర్మిట్లతో పనిచేసుకుంటున్నవారిని కొనసాగించే ప్రసక్తే లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వర్క్ పర్మిట్ల రెన్యూవల్, కొత్త పర్మిట్ల జారీపై ఆంక్షలు విధించారు. దీంతో లక్షల మంది అమెరికాను వీడి స్వస్థలాలకు చేరిపోయారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన ట్రంప్.. అంతర్జాతీయ ఒప్పందాల నుండి వైదొలగడం, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే లక్ష్యంతో కుదిరిన పారిస్ క్లైమేట్ డీల్ నుండి అమెరికాను ఏకపక్షంగా తొలగించారు. ఇరాన్‌తో కుదిరిన చారిత్రాత్మక అణు ఒప్పందం నిరర్థకమైనదని పేర్కొంటూ దాని నుండి వైదొలిగారు. విదేశీ సహాయాన్ని భారీగా తగ్గిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ని రద్దు చేయడానికి ప్రయత్నించారు. బర్త్ సిటిజన్ షిప్ పై ఆంక్షలు … ట్రంప్ నిర్ణయంతో బెంబేలు.. అమెరికాలో స్థిరపడిన వలసదారులకు పౌరసత్వంపై ఆంక్షలను కఠినతరం చేశారు. పొరుగుదేశీయుల సంతానానికి అమెరికాలో పౌరసత్వం ఇచ్చేది లేదనే ఆంక్ష విధించి వేలాది మందిని ఇబ్బందులకు గురిచేశారు.ప్రపంచంలో అమెరికాకు తిరుగులేదనే విధంగా ప్రతి అంశంలోనూ తనదే పైచేయిగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాపత్రయపడ్డారు.
ఇరాన్ పై యుద్ధంలో వెనకడుగు.. ఇరాన్ పై సుధీర్ఘకాలం దొంగచాటు దెబ్బకొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ… ఇరాన్ ఎక్కడా భయపడకుండా యుద్ధక్షేత్రంలో పైచేయిసాధించింది. దీంతో ట్రంప్ చేసేదేమీలేక మిన్నకుండిపోవాల్సి వచ్చింది. కెనడాతో తలెత్తిన వాణిజ్య వివాదాల నేపథ్యంలో, ఆంటారియో సరస్సు పేరును లేక్ అమెరికా గా మారుస్తూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. పౌరసత్వ నిబంధనలపై స్పష్టతనిస్తూ, 'బర్త్ టూరిజం వంటి వాటిని అరికట్టడానికి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా బల్క్-పవర్ సిస్టమ్ భద్రత కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం, రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు శాంతి కాముకుడని పదేపదే తనుకు తానుగా చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వారు. అంతర్జాతీయ సంబంధాలు, సరిహద్దు వివాదాలతో మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం చేపట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అక్రమ వలసలను అడ్డుకోవడానికి మెక్సికో సరిహద్దు వెంబడి భారీ గోడ నిర్మాణాన్ని చేపట్టి, నిధుల కోసం అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రభుత్వ షట్డౌన్కు కారణమయ్యారు. విద్యా సంస్కరణల పేరుతో గందరగోల పరిస్థితి.. విద్యారంగంలో సంస్కరణలపేరుతో విద్యార్థులు గందరగోల పరిస్థితిని క్రియేట్ చేశారు. దీంతో వివిధ దేశాలనుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విద్యారంగ రక్షణలను పక్కనపెట్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను పూర్తిగా రద్దు చేయడానికి ఉద్యోగులను తొలగించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెచ్చారు. ప్రభుత్వ విభాగాల్లో, యూనివర్సిటీల్లో డైవర్సిటీ, ఈక్విటీ, అండ్ ఇన్‌క్లూజన్ విధానాలను రద్దు చేస్తూ లిండన్ జాన్సన్ నాటి పాత సివిల్ రైట్స్ ఆర్డర్‌ను రద్దు చేశారు. ప్రపంచదేశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగడుగునా.. వ్యక్తిగత స్వార్థప్రయోజనాలకోసం పాకులాడినట్లే కనిపించారు. పొరుగు దేశాలను ఇబ్బందిన పెట్టినట్లు చరిత్రలో ఇలాంటి అధ్యక్షుడిని చూడలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. శాంతిని ఆకాంక్షిస్తున్నానని చెబుతూ.. పొరుగుదేశాలను ఉద్ధేశపూర్వకంగా ఇబ్బంది పెట్టిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు.
(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.