
మనం సంతోషంగా ఉన్నామా, బాధలో ఉన్నామా అనేది మన పెంపుడు కుక్కలు ముఖం చూసి చెప్పేయగలవని వియన్నా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మనుషుల ముఖ కవళికలను అర్థం చేసుకోవడమే కాకుండా, వాటి మధ్య ఉన్న తేడాలను కూడా కుక్కలు గుర్తించగలవని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఈ అధ్యయన ఫలితాలను 'ఐసైన్స్' (iScience) అనే జర్నల్లో ప్రచురించారు.ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు కొన్ని పెంపుడు కుక్కలపై (ఎక్కువగా బోర్డర్ కోలీ జాతికి చెందినవి) ఎఫ్ఎంఆర్ఐ (fMRI) బ్రెయిన్ స్కాన్లను ఉపయోగించారు. వాటికి సంతోషం, బాధ, కోపం, భయం వంటి వివిధ భావోద్వేగాలతో కూడిన మనుషుల ఫోటోలను చూపించారు. సంతోషంగా ఉన్న ముఖాలను చూసినప్పుడు కుక్కల మెదడులోని రివార్డ్ సెంటర్లు, సామాజిక స్పృహకు సంబంధించిన భాగాలు చురుగ్గా మారినట్లు స్కాన్లలో తేలింది. ముఖ్యంగా, భయం, బాధ, కోపం వంటి నెగెటివ్ భావోద్వేగాల మధ్య తేడాను కూడా కుక్కలు గుర్తించగలవని ఈ అధ్యయనం తేల్చింది. అయితే, కేవలం ముఖ కవళికల ఆధారంగా కోపం, బాధ మధ్య వ్యత్యాసాన్ని కచ్చితంగా చెప్పలేకపోయాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి శరీర భాష, స్వరం వంటి అదనపు సంకేతాలు అవసరం కావచ్చని అభిప్రాయపడ్డారు.వేల సంవత్సరాలుగా మనుషులతో కలిసి జీవిస్తుండటంతో, వారి ముఖ కవళికలను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని కుక్కలు అభివృద్ధి చేసుకున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. యజమాని మూడ్ను పసిగట్టడం వాటి మనుగడకు, బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే, ఈ అధ్యయనం తక్కువ సంఖ్యలో కుక్కలపై, అదీ ఒకే జాతిపై ఎక్కువగా