
‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు - దర్శకుడు ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా తెరెక్కించిన ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది - దర్శకుడు ఎం.ఎస్. రాజు శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలు ఓ సారి చూద్దాం. ‘అగధ’ అంటే ఏంటి? ‘అగధ’ అని టైటిల్ పెట్టగానే చాలా మంది నెట్లో సర్చ్ చేశారు. అగధ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’. ప్రస్తుతం సినిమాకి ఓపెనింగ్స్ తీసుకు వచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ బయటకు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్యాం ప్రసాద్ రెడ్డి నా గురించి ఓ మాట చెప్పాడు. నాకు తెలిసిన ఎం.ఎస్. రాజు కేవలం హారర్ ఎలిమింట్స్‌తో మాత్రమే సినిమా తీయడు.. ఇందులో చాలా అంశాలు ఉంటాయి అని ఆయన అన్నాడు. నన్ను ఎంత అర్థం చేసుకున్నాడో ఆ మాటలే సాక్ష్యం. ఆయన చెప్పినట్టుగానే కేవలం ఇందులో హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు ‘అగధ’లో ఉంటాయి. దేవుడికి