
ప్రతిసారీ వీకెండ్ వస్తే చాలు.. రొటీన్ మాల్స్, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ గొడవలతో చిరాకు వస్తోందా? కొద్దిరోజులు ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ డెడ్‌లైన్స్ పక్కనపెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని ఉందా? అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి కేరళ కోవలం లేదా విదేశాల్లోని మాల్దీవ్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ గుండెకాయ లాంటి దిండిబ్యాక్వాటర్స్, అలాగే విజయవాడలోని 'భవానీ ఐలాండ్' సందర్శిస్తే చాలు.. మీకు కచ్చితంగా విదేశీ రిజార్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కొబ్బరితోటలు, పచ్చని కొండలు, నీటిపై తేలియాడే హౌస్బోట్లు.. ఒకే ఒక్క ట్రిప్‌తో మీ వారమంతా ఉన్న స్ట్రెస్ దూదిపింజలా ఎగిరిపోతుంది. కోనసీమ ప్రాంతంలోని దిండి వద్ద రాజమండ్రి/అమలాపురం పరిసరాల్లో ప్రవహించే గోదావరి పాయలు, నీలిరంగు బ్యాక్‌వాటర్స్ అచ్చం కేరళ ఆలేప్పి తరహాలోనే ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రైవేట్ రిసార్టులు నడిపే హౌస్‌బోట్ ప్రయాణం ఈ ట్రిప్ సూపర్ ఉంటుంది. గంటల తరబడి నీటిపై ప్రయాణిస్తూ, ఏకాంతంగా డెక్ మీద కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. బోట్లోనే ఏపీ స్పెషల్ ఘుమఘుమలాడే వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం ఆస్వాదించవచ్చు. ఫ్యామిలీతో లేదా లైఫ్‌పార్ట్‌నర్‌తో కలిసి నైట్ స్టే చేయడానికి కూడా ఈ హౌస్బోట్లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్స్‌లోని భవానీ ఐలాండ్ మీకు రివర్ ఐలాండ్ అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన ఈ ఐలాండ్‌కు వెళ్లాలంటే పున్నమి ఘాట్ నుంచి 6 నిమిషాల బోట్ జర్నీ చేయాలి. కృష్ణానది నీటి నడుమ పచ్చని చెట్లు, మడ అడవుల మధ్య ఉండే ఈ ద్వీపం ఒక మినీ వాటర్ పార్క్‌లా ఉంటుంది. కుటుంబంతో కలిసి వీకెండ్ స్పెండ్ చేయడానికి రిసార్టులు, సైక్లింగ్ ట్రాక్‌లు, రివర్ వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్ వంటి అనేక అడ్వెంచర్ రిక్రియేషన్స్