
కొంచాడ శ్రీనివాస్.. ఇలా పేరు చెబితే చాలా మంది ఈ టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టకోవచ్చు కానీ.. పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. శ్రీకాకుళంకు చెందిన ఈ నటుడు పలు తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే దాదాపు పది సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. ఈ నటుడు స్పెషాలిటీ ఏంటంటే.. సినిమాల్లో ఈ యాక్టర్ కు పెద్దగా డైలాగులుండవు. అయినా తన కంటి చూపతోనే ఆడియెన్స్ ను భయపెట్టాడు. కొంచాడ శ్రీనివాస్ రూపం, గుబురు జుట్టు ముఖ్యంగా కళ్లు ఆయనను అందరి మధ్య ప్రత్యేకంగా నిలిపాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీస్’ లో ఓ కీలక పాత్ర పోషించారు కొంచాడ. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆది’లోనూ నటించారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ ‘ప్రేమ కావాలి’ చిన్నా ఆ ఇంట్లో, తనీశ్ నచ్చావులే తదితర సినిమాల్లో కొంచాడ శ్రీనివాస్ చేసిన పాత్రలు బాగా హైలెట్ గా నిలిచాయి. ఓవరాల్ గా దాదాపు 40 సినిమాల్లో నటించారు కొంచాడ. అలాే దాదాపు 10కి పైగా సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. కాగా తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొంచాడ శ్రీనివాస్. అయితే నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. అది కూడా 47 ఏళ్ల వయసులోనే. ఓ సినిమా షూటింగ్ సమయంలో కింద పడిపోవడంతో శ్రీనివాస్‌కు ఛాతీపై దెబ్బ తగిలిందట. దీంతో అప్పటి నుంచే ఆయనకు గుండె సమస్యలు తలెత్తాయట. ఇక ప్రతి సంక్రాంతికి సొంత ఊరు వెళ్లడం కొంచాడకు అలవాటు. అలా 2022లో కూడా సంక్రాంతి పండగ కోసం శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని కాశీబుగ్గ పట్టణానికి వెళ్లాడు. అయితే అక్కడే ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు