
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికిది తొలి శతకం. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌కు మరో ప్రత్యేకత ఉంది. భారత క్రికెట్ చరిత్రలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెస్టుల్లో శతకం చేసిన తొలి బ్యాటర్‌గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. ఇక.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ. అతను 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (114*; 99 బంతుల్లో) శతకం చేశాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ ఆగస్టు 14న ప్రారంభమైనప్పటికీ భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 తెల్లవారుజామున కోహ్లీ ఈ సెంచరీని పూర్తి చేశాడు. గణతంత్ర దినోత్సవం రోజున టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. 2012లో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. ఇక, శ్రీలంకతో తొలి టెస్టు విషయానికొస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 63 ఓవర్లు ముగిసేసరికి 239/2 స్కోరుతో ఉంది. పడిక్కల్ (107*; 147 బంతుల్లో), రిషభ్ పంత్ (3*) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ (77) రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32) పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు