
దిల్లీ: పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ పారిశుద్ధ్య కార్మికుడిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన తూర్పు దిల్లీలోని కల్యాణ్పురిలో కలకలం రేపింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అనిల్ (27)పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనకు సంబంధించినట్లు చెబుతున్న సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ హత్యపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వైరల్ వీడియో నిజమైనదా? అందులో కనిపిస్తున్న వ్యక్తే నిందితుడా? అన్నది పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. వైరల్ అవుతున్న సీసీ కెమెరా దృశ్యాల్లో పసుపు రంగు టీషర్ట్ ధరించిన వ్యక్తి కొంత దూరంలో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. అనిల్ తన పని చేసుకుంటుండగా అతడి వద్దకు వచ్చిన ఆ వ్యక్తి.. టీషర్ట్ వెనుక దాచుకున్న పదునైన ఆయుధాన్ని బయటకు తీసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటామాటా జరిగిన అనంతరం.. ఆ వ్యక్తి అనిల్ కడుపులో కత్తితో పొడిచినట్లు దృశ్యాలు ఉన్నాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు