
ఇంటర్నెట్ డెస్క్: శిర్డీ సాయిబాబాను (Shirdi Sai Baba) లక్ష్యంగా చేసుకొని, రూపొందించిన అభ్యంతరకర వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై దిల్లీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సంబంధిత వీడియోలను యూట్యూబ్ నుంచి తొలిగించాలని వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి సూచించింది. ఇదే అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖతోపాటు గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ ఆత్మకథ.. రాహుల్ భావోద్వేగ పోస్ట్ శిర్డీ సాయిబాబాకు సంబంధించి అభ్యంతరకర వీడియోలు తొలగించే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ)కు దిల్లీ హైకోర్టు (Delhi High Court) గతంలోనే సూచించింది. ఈ క్రమంలో జీఏసీ ఇటీవల చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా కొన్ని వీడియోలు అలాగే ఉన్నాయని పేర్కొంటూ శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. వివాదాస్పదమైన కంటెంట్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వీటిని ఇలాగే కొనసాగిస్తే.. మత సామరస్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని వాదించింది. వాదనలు విన్న దిల్లీ న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. ఈలోగా ఇంకేమైనా కొత్త ఫిర్యాదులు దాఖలైతే సంబంధిత అధికారులు వాటిని పరిశీలిస్తారని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది