
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ త్వరలో రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీలో ఉన్న ఆమె శనివారం ముంబై విమానశ్రయంలో కనిపించారు. బెంగుళూరులోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పబ్లిక్కు దూరంగా ఉంటున్న దీపికా తాజాగా సాధారణ దుస్తుల్లో ఎయిర్‌పోర్టులో కనిపించారు. అయితే ఆమెతో పాటుగా రణ్వీర్ సింగ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. 2013లో రామ్‌లీలా సినిమా సమయంలో ప్రేమలో పడిన దీపిక, రణ్‌వీర్‌లు 2018లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 2024లో వారికి కుమార్తె దువా జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్లు వీరిద్దరు ప్రకటించారు. కాగా దీపికా ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే దీపికా ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ అల్లు అర్జున్‌తో ‘రాకా’ సినిమాలలో నటిస్తోంది. భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా