
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Abishek Porel Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఆరోపణలపై ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అభిషేక్ పరేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఓ యువతి చేయగా.. అతడిపై పోలీసులకు ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా అభిషేక్‌ను అరెస్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో యువ క్రికెటర్ అభిషేక్ పరేల్‌ను అరెస్ట్ చేయడం క్రికెట్ రంగంలో కలకలం రేపుతోంది. ఏం జరిగింది..? అభిషేక్ పరేల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడని.. తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ మెడికల్ విద్యార్థిని డమ్ డమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్‌లో వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అభిషేక్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఆ యువతి చేసింది. అభిషేక్‌తో తనకు మూడేళ్లు తాను సంబంధం కొనసాగిస్తున్నట్లు.. గతేడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ యువతి ఆరోపణలు చేసింది. అనంతరం కేసులో పోరెల్‌ను అరెస్ట్ చేయాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ ప్రకటించారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి కేసు ఎదుర్కోవడంతో అభిషేక్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది. విచారణ అనంతరం శిక్ష పడితే మాత్రం అభిషేక్ భవిష్యత్ అంధకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ ఐపీఎల్ ప్రస్థానం పశ్చిమ బెంగాల్