
ఇంటర్నెట్ డెస్క్: తన కెరీర్ నిలబడేందుకు ఐపీఎల్లో చేసిన ఓ సెంచరీనే కారణమని దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలపై అతడు మాట్లాడాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌ను గెలిచి ఆటకు వీడ్కోలు పలకాలని ఉందని చెప్పాడు. ఇక ఐపీఎల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ల గురించి ప్రస్తావించాడు. ‘‘రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై 2013 ఐపీఎల్ సీజన్లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడా. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన నాకు అదే ఫస్ట్ టీ20 సెంచరీ. చాలా గుర్తింపు తీసుకొచ్చింది. నా కెరీర్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ మరిచిపోలేను.. డర్బన్ వేదికగా ఆసీస్ ఛేజింగ్‌లో శతకం కొట్టా. ఇప్పుడ నేను చెప్పిన ఆ రెండు సెంచరీలు తీవ్ర ఒత్తిడిలో ఆడినవే. అందుకే, నా దృష్టిలో అవి ఉత్తమం. బ్యాటర్‌గా నా కెరీర్‌ను మ్యాచులను ఫినిష్ చేసే స్థాయికి తీసుకెళ్లా. నేను మంచి ఫినిషర్ అని భావిస్తా. ఆ విషయంలో గర్వంగా ఫీలవుతా. కానీ, ఇప్పటికీ నేర్చుకోవడం మాత్రం ఆపలేదు. సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించాలంటే మాత్రం తప్పిదాల నుంచి నేర్చుకోవాలి. ఛేజింగ్‌లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. అలాంటి సవాళ్లను ఇష్టపడతా’’ అని మిల్లర్ (Miller) వెల్లడించాడు. 37 ఏళ్ల డేవిడ్ మిల్లర్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 178 వన్డేల్లో 4,611 పరుగులు, 140 టీ20ల్లో 2,806 పరుగులు చేశాడు. ఐపీఎల్లో (IPL) 152 మ్యాచులు ఆడిన మిల్లర్ 3,288 రన్స్ రాబట్టాడు. మిడిలార్డర్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడటంలో గుర్తింపు సాధించాడు. అయితే, అతడి కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు