ఆస్ట్రేలియా డార్విన్‌లోని మార్రారా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఊహించని సంచలనం నమోదైంది. పసికూన బంగ్లాదేశ్‌ను స్వదేశంలో చిత్తు చేస్తుందని భావించిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్‌లో అనూహ్యంగా తడబడింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను బంగ్లాదేశ్ పేస్ త్రయం హసన్ మహ్మూద్ , తస్కిన్ అహ్మద్, ఎబాదోత్ హుస్సేన్‌లు దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యంగా యంగ్ పేసర్ హసన్ మహ్మూద్ 6 వికెట్లతో (6/55) కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు జేక్ వెదరాల్డ్ (23), ట్రావిస్ హెడ్ (22లను హసన్ మహ్మూద్ వెంటవెంటనే పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లాబుషేన్ (1) ఎబాదోత్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుతిరగ్గా, ఆల్ రౌండర్ కెమెరాన్ గ్రీన్‌ను తస్కిన్ అహ్మద్ తక్కువ పరుగులకే ఔట్ చేశాడు.వికెట్ కీపర్ అలెక్స్ కారీ (19), బ్యూ వెబ్స్టర్లను వరుసగా ఎబాదోత్, టాస్కిన్లు క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. టీ విరామం ముందు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లను హసన్ మహ్మూద్ పెవిలయన్ పంపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ (71) ఒంటరిపోరాటం చేసినా.. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో 26 ఏళ్ల హసన్ మహ్మూద్ సంచలన ప్రదర్శన చేశాడు. 17 ఓవర్లలో 55 రన్స్ ఇచ్చి.. 6 వికెట్లు తీశాడు. అంతేకాకుండా భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఫైఫర్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అతడి ఇప్పటివరకు కేవలం 15 టెస్టులు మాత్రమే ఆడటం గమనార్హం. దీంతో బంగ్లాదేశ్ పేస్ దళానికి హసన్ మహ్మూద్ ఒక పెద్ద ఆస్తిగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తొలి రోజు ఆట ముగిసే