© 2026 nimisham.in

నేటి రాశి ఫలాలు.. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, జేష్ట మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 జూలై 12వ తేదీ, ఆదివారం. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? పండితుల ప్రకారం ఏ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి? ప్రదోష వ్రతం, మాస శివరాత్రి ప్రత్యేక రోజున ప్రయాణాలు వాయిదా వేసుకోవలసిన రాశులు ఏవి? అలాగే విజయాలు సాధించే రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దీనివల్ల పని ప్రదేశంలో ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి పొందే అవకాశం ఉండటంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. స్నేహితుల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.లేదంటే ఆత్మవిశ్వాసం తగ్గి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు శుభకరమే. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు అభివృద్ధి పథంలో సాగుతారు. ఇతరులు గుర్తించకముందే మీరు విజయపథంలో చేరుతారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభ ఫలితాలను ఈ రోజు పొందే అవకాశం ఉంది. సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. వృత్తిపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. మీకు నమ్మకమైన వారితో మీ అభిప్రాయాలను పంచుకోవడం మీకు ఉపయోగపడుతుంది. కుటుంబంలో సఖ్యతను పెంచుకోండి. కుంభ రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఇతరుల గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యత కలిగి ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు
ఆలోచించి నిర్ణయించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)