
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో ఆగిపోతాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు కష్టంతో పూర్తవుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి