
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం తప్పదు. ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయటా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి