
చిన్నసినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి, కంటెంట్ ను నమ్ముకొని విడుదలవుతున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఓ ఆసక్తికర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Found this helpful?