పారిశ్రామికవేత్తలు ఎంత నిలదొక్కుకోవాలని ప్రయత్నించినప్పటికీ, పాలకుల నుండి ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు. ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు విదేశీ పాలకులు స్థానిక వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రమంగా నాశనం చేయడానికి ప్రయత్నించారు.
1839 నాటి మహా ఉప్పెన సంభవించిన తరువాత కోరంగికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. అయితే ఈ దారుణ విపత్తును బ్రిటిష్ ప్రభుత్వం తమ వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకుందనే వాదనలు ఉన్నాయి. వినాశనం తర్వాత స్థానిక ప్రజలు, వ్యాపారులు ఓడరేవును, నౌకా నిర్మాణ కేంద్రాలను పునర్నిర్మించాలని ఎన్నో వినతులు సమర్పించినప్పటికీ అప్పటి పాలకులు ఇసుమంతైనా స్పందించలేదు. కోరంగి మళ్లీ కోలుకుంటే తమ సొంత నౌకా వాణిజ్యానికి గండి పడుతుందని భావించి, ఆ పోర్ట్ అభివృద్ధిని పూర్తిగా మూలన పడేసారు.
మన ఇల్లు గాలివానకు పడిపోతే వెంటనే కట్ఠుకుంటాం మన బతుకుల్ని నిలబెట్టుకుంటాం. అలాంటి ప్రకృతి విపత్తులు సహజం కనక. కానీ బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశంలొ 1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన చెయ్యలేదు. ఈ విధంగా ఒక ప్రాచీన పారిశ్రామిక నగర చరిత్ర కాల గర్భంలో కలసిపోయింది.
విదేశాల్లో కోరంగి ముద్ర, సాంస్కృతిక వారసత్వం
కోరంగి ప్రాంతం నుండి ప్రపంచ నలుమూలలకు నౌకల ద్వారా ప్రయాణించిన కార్మికులు, నావికులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. నాటి కాలంలో ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలుగు వారిని కోరంగి వారు అని పిలిచేవారని ఆధారాలు చెబుతున్నాయి. నౌకా నిర్మాణంలో ప్రావీణ్యం ఉన్న సాంకేతిక నిపుణులను ఇతర దేశాల వ్యాపారులు ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. భారత సంస్కృతి, నైపుణ్యం సరిహద్దులు దాటి విస్తరించడానికి కోరంగి పోర్టు నగరం ఎంతగానో దోహదపడింది. అయితే తగిన రికార్డులు, సరైన చారిత్రక రాతలు లేకపోవడం వల్ల ఈ శతాబ్దాల నాటి గొప్పతనం మన తర్వాతి తరాలకు స్పష్టంగా చేరలేదు.
అంతెందుకు.. భారత తొలి ప్రధాని జవహర్ లాన్ నెహ్రూ.. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఇండియన్ హిస్టరీ పుస్తకాన్ని రచించారు. అయితే.. అందులో బ్రిటిషు వారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను అనాగరికులుగా, ఏమీ తెలియని వారిగా అభివర్ణించారు. రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా.. రాజ్యాంగ రచనకోసం భారత సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకుని రాసుకున్నాం అని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఒక్కరే రాజ్యాంగాన్ని కూర్చుని రాసేశారు అని మనం అనుకుంటాం. కానీ రాజ్యాంగం లో ఉన్న లోపాలను చూసి స్వయంగా అంబేడ్కర్ ఈ రాజ్యాంగంలో ఎన్నో పొరపాట్లు వున్నాయి. ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామన్న ప్రతి పాదన వస్తే అలా తగలబెట్టే వాళ్ళల్లో ముందు నేనే వుంటా అని ఆయన బహిరంగంగా చట్ట సభలో అన్నమాటల్ని నెహ్రూ బయటకు రానివ్వలేదు.
ఉప్పెన తరువాత కొన్నిసంవత్సరాలకే గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థర్ కాటన్ నాయకత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగిన మాట వాస్తవమే అయినా.. అంతకు ముందున్న పారిశ్రామిక విప్లవాన్ని, నౌకా వైభవాన్ని కప్పిపుచ్చేలా చరిత్ర కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. బ్రిటిష్ పాలకులు చేసిన అభివృద్ధి చర్యలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ, దానికి ముందే ఉన్న భారత సంపదను, సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరిగాయి. దీనివల్ల స్థానిక చరిత్రలోని కీలకమైన కోణాలు వెనుకబడిపోయాయి.
నేటి పరిశోధనలు ఇండియాకు చెందిన అనేక చారిత్రక విషయాలు విదేశీ ఆధారాలు లేదా బ్రిటిష్ దృక్కోణంలోనే నమోదయ్యాయి. భారతీయుల సాంకేతిక పరిజ్ఞానం, ప్రాచీన పారిశ్రామిక నైపుణ్యాల గురించి సరైన రీతిలో పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావన రాకపోవడం విచారకరం. కోరంగి వంటి నగరాల వైభవం మరుగున పడిపోవడం వల్ల మన ప్రాచీన వారసత్వం విలువ తగ్గింది. నేటి తరం పరిశోధకులు, చరిత్రకారులు లభ్యమవుతున్న పత్రాలను, సముద్ర ఆధారాలను విశ్లేషించి నిజమైన భారత చరిత్రను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది.
చారిత్రక సత్యాల పునరుద్ధరణపై ప్రజా నిరీక్షణ
కోరంగి ఓడరేవు విధ్వంసానికి 180 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో, ఆ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొరింగ అభయారణ్యం, సమీప తీర ప్రాంతాల చరిత్రపై ప్రత్యేక పరిశోధనలు జరిపి, నాటి నౌకా రంగానికి సంబంధించిన మ్యూజియం లేదా స్మారక కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మన పూర్వీకుల గొప్పతనాన్ని, బ్రిటిష్ పాలనలో జరిగిన ఆర్థిక దోపిడీని నిష్పాక్షికంగా నేటి సమాజానికి అందించినప్పుడే మన నిజమైన చరిత్రకు సరైన న్యాయం జరుగుతుంది.
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Coringa Port History Telugu, 1839 Coringa Cyclone, East Godavari Ship Building History, Coringa Lost Port City, British Raj Exploitation TeluguOne
అగ్రరాజ్యంలో ఆకలి చీకట్లు.. యుద్ధాలకు బిలియన్ డాలర్లు.. సొంత పౌరులకు గూడు కరువు.!
.