
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పరకాల నుంచే బరిలో దిగుతానని ఆమె అన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి కూడా పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు వనపర్తి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సైతం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై టీపీసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. పలువురిని వ్యక్తిగతంగా దూషించడంతో ఆయన్ను సస్పెండ్ చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు