
Malkajgiri: బోనాల ఉత్సవాలు సక్సెస్: అధికారులకు ఘన సన్మానం! మల్కాజిగిరి: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేసిన వివిధ శాఖల అధికారులను మల్కాజిగిరి 183 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ విజయ్ కుమార్, మున్సిపల్ శాఖ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా, విద్యుత్ శాఖ ఏఈ గోపాల్ తదితర అధికారులను కలిసి సన్మానించారు.బోనాల ఉత్సవాలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన డివిజన్, నియోజకవర్గ ప్రజలకు జీడి సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మల్కాజిగిరి డివిజన్‌తో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజేష్ గౌడ్, గౌసుద్దిన్ భాయ్, మహేందర్ గౌడ్, భాస్కర్,నగేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మల్కాజిగిరి అధ్యక్షులు జీడి చరణ్‌జిత్ గౌడ్, సంజయ్,రవీందర్, కుమార్ గౌడ్,పార్థసారథి తదితరులు పాల్గొన్నారు
.