
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ సినిమా సెట్లో ఎంత సరదాగా, జోవియల్‌గా ఉంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా మంది సెలబ్రెటీలు ఆయన పనిచేసిన అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. అలాగే గతంలో పోడ్కాస్ట్లో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను, మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆహ్లాదకరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆగడు చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు చేసిన అల్లరి, తమపై వేసిన జోకులు గురించి ఆయన మాట్లాడారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. ప్రభాస్ శ్రీను తన ఇంటర్వ్యూలో మహేష్ బాబును చూస్తే చాలా కామ్‌గా, కంపోజ్డ్గా ఉంటారని చాలా మంది అనుకుంటారని, కానీ మేకింగ్ వీడియోలలో మాత్రం ఆయన చుట్టూ ఉన్నవాళ్లందరూ పడి పడి నవ్వుకుంటారని తెలిపారు. "ఆయన చాలా జోవియల్‌గా ఉంటారు. బయటికి వచ్చినప్పుడు తక్కువ కనిపిస్తారు, కనిపించేదే తక్కువ, దాంట్లో కూడా చురకలు పడతా ఉంటాయి" అని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆగడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరంగా వెల్లడించారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ బాంబేలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో షూటింగ్ జరుగుతోందని, ఆ వేడిమికి సెట్లో అందరూ అల్లాడిపోయారని శ్రీను పేర్కొన్నారు. బ్రహ్మానందం గారికి, ఇతర నటీనటులకు చెమటలు కారిపోయాయని, సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు సెట్లో దాదాపు 25-26 డినో లైట్లు పెట్టారని, ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా మారిందని వివరించారు. ప్యాకప్ ఎప్పుడు అవుతుందా అని ఆర్టిస్టులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, స్కూల్ సెలవులు ఇస్తే పిల్లలు ఎంత